హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 181లోని భూదాన్ భూమిని అక్రమంగా బదిలీ చేశారంటూ ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్పై దాఖలైన ప్రైవేట్ ఫిర్యాదుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కే సుజన సోమవారం విచారణ జరిపారు. గతంలో మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేశారు.