Chiranjeevi | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ సొసైటీలో వివాదాస్పదమైన 595 చదరపు గజాల స్థలం విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సినీహీరో కొణిదెల చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పింది. పారు, ప్రజావసరాల కోసం జీహెచ్ఎంసీకి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ స్థలాన్ని అప్పగించింది.
అదే 595 చదరపు గజాలను చిరంజీవికి కేటాయించడాన్ని తప్పుపడుతూ కే శ్రీకాంత్‌బాబు సహా ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి మంగళవారం విచారణ జరిపారు. 595 చదరపు గజాల అమ్మకాలకు సంబంధించిన సొసైటీ మేనేజింగ్ కమిటీ, వార్షిక సర్వసభ్య సమావేశం ఆమోదం చెప్పిన రికార్డులను తెప్పించుకొని పరిశీలించాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ప్రజావసరాల కోసం నిర్దేశించిన స్థలాన్ని జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోలేదన్నారు. అదే స్థలాన్ని చిరంజీవికి విక్రయించారని చెప్పారు. వాదనల తర్వాత స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 25కి వాయిదా వేసింది.