సంక్షేమ పథకాలపై ప్రభుత్వ అధికారమెంత?
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధి ఎంతవరకు ఉన్నదన్న అంశంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. రాజ్యాంగంలోని 162, 15(3) అధికరణల కింద ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలపై డివిజన్ బెంచ్ ప్రధానంగా దృష్టి సారించనుంది.
- సమగ్రంగా విచారిస్తామన్న హైకోర్టు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై నేడు విచారణ
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం కల్పించిన అధికారాల పరిధి ఎంతవరకు ఉన్నదన్న అంశంపై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరుపనున్నది. రాజ్యాంగంలోని 162, 15(3) అధికరణల కింద ప్రభుత్వం చేపట్టే సంక్షేమ చర్యలపై డివిజన్ బెంచ్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ సోమవారం విచారణకు వచ్చింది.
అప్పీలుకు నంబర్ కేటాయించే విషయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం తోసిపుచ్చింది. అప్పీలుకు నంబర్ కేటాయించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దీంతో ప్రధాన అప్పీలుపై మంగళవారం విచారణకు మార్గం సుగమమైంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీచేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ వ్యక్తిగత హోదాలో హైకోర్టును ఆశ్రయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

