ఖజానా ఖాళీ పైసల్లేవ్.. భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వలేం
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదా? కనీసం భూములు కోల్పోయిన వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా సకాలంలో అందించలేని దుస్థితి నెలకొన్నదా?
- కోర్టుకు తెలిపిన ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి
- 12 వారాల్లో చెల్లించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నదా? కనీసం భూములు కోల్పోయిన వారికి చట్టబద్ధంగా చెల్లించాల్సిన పరిహారాన్ని కూడా సకాలంలో అందించలేని దుస్థితి నెలకొన్నదా? రూ.40 వేల కోట్లకు పైగా పరిహారం టోకెన్లు జారీచేసినా వాటికి సరిపడా నిధులు సమకూర్చలేకపోతున్నామని స్వయంగా ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టుకు నివేదించడం ప్రభుత్వ ఆర్థిక దుస్థితిని బయటపెట్టింది. వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం భూములు సేకరించి, పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు నిధుల కొరత సాకుతో చెల్లింపులను వాయిదా వేసే స్థితికి దిగజారింది. రూ.40 వేల కోట్లకు పైగా టోకెన్లు జారీ చేసినా, వాటి చెల్లింపులు జరుపలేకపోతున్నామని ప్రభుత్వ ఉన్నతాధికారే స్వయంగా అంగీకరించారు.
భూసేకరణ పరిహారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం, ఆచరణలో మాత్రం చేతులెత్తేస్తున్నది. నారాయణపేట జిల్లాలో ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించాలని హైకోర్టు గతంలోనే ఆదేశించినప్పటికీ అమలు కాకపోవడంతో బాధితులు ఏడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. గత విచారణలో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ఆదేశించినా, మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. కోర్టు ధికరణ కేసులను అధికారులు తేలిగ్గా తీసుకుంటున్నారని, కోర్టు హాజరు నుంచి మినహాయింపు పొందటం అధికారుల హకు కాదని స్పష్టం చేశారు. అనంతరం ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఆన్లైన్లో హైకోర్టు విచారణకు హాజరై, ప్రస్తుతం చెల్లింపులు చేసే ఆర్థిక స్థితిలో ప్రభుత్వం లేదని తేల్చిచెప్పారు.
పెండింగ్ పరిహారాన్ని చెల్లించేందుకు ఆరు నెలల గడువు ఇవ్వాలని కోరారు. అయితే, భూములపై హకుల విషయంలో వివాదం లేకుండా పరిహారానికి అర్హులని తేలిన వారికి కూడా డబ్బులు చెల్లించకపోవడం ఏమిటని న్యాయమూర్తి నిలదీశారు. ప్రాజెక్టుల కోసం భూములు అప్పగించిన వారు జాతినిర్మాణంలో భాగస్వాములని, వారికి పరిహారం అందించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టంచేశారు. ప్రభుత్వం కోరిన ఆరు నెలల గడువును తిరసరించారు. కోర్టు ధికరణ పిటిషన్లలో పేరొన్న సుమారు రూ.51.35 కోట్లను 12 వారాల్లోగా చెల్లించాలని ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిల వివరాలు, వాటి చెల్లింపులకు అనుసరించనున్న కార్యాచరణతో అదనపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేశారు.
గతంలోనూ హైకోర్టు గడువులు
భూసేకరణ పరిహారం చెల్లింపులపై గతంలోనూ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తూ గడువు విధించింది. కొలిసాగర్ ఎత్తిపోతల పథకం రెండో దశ కోసం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని మరికల్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో సేకరించిన భూములకు సంబంధించి 2025 ఏప్రిల్‌లో హైకోర్టు నాలుగు నెలల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు కోసం అంకెనపల్లి గ్రామంలో సేకరించిన భూములకు సంబంధించి పరిహారాన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ మూడు రెట్లు పెంచింది. అయినా చెల్లింపులు జరుగకపోవడంతో 2026 ఏప్రిల్‌లో మరోసారి మూడు నెలల గడువు విధించింది. అయినప్పటికీ బాధితులు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు, 2026 ఆగస్టులో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ, పునరావాసం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.6 వేల కోట్లు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో రూ.1,056 కోట్లు, ఆ తర్వాత మరో రూ.1,500 కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించింది. అయినా వివిధ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతున్నది. నిధుల కేటాయింపులు, వాస్తవ చెల్లింపుల మధ్య భారీ తేడా ఉందంటూ దాఖలైన పిటీషన్లపై కోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. వీటిపై ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

