 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామినేషన్ల తిరసరణ వ్యవహారంలో జోక్యం చేసుకొనేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున కోర్టుల జోక్యానికి ఆసారం లేదని చెప్పింది.
ఈ మేరకు గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించింది. నామినేషన్లపై అభ్యంతరాలుంటే ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని చీఫ్ జస్టిస్ ఆపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. నామినేషన్‌ను తిరసరిస్తూ ఎన్నికల అధికారి జారీచేసిన ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలన్న పిటిషన్లను కొట్టివేసింది.
 
                            