Dale Steyn : దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) ఐపీఎల్ 19వ సీజన్లో రికార్డుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)ని ఆకాశానికెత్తేశాడు. పదిహేనేళ్ల వైభవ్ ఆటకు ఫిదా అయిన స్టెయిన్ అతడు భారత క్రికెట్ ఆస్తి అని, అతడు గొప్ప శిఖరాలకు చేరుతాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇండియన్ క్రికెట్లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల ఘనతలను వైభవ్ అధిగమిస్తాడని సఫారీ లెజెండ్ అన్నాడు.
వీరకొట్టుడే మంత్రగా ఐపీఎల్లో.. అంతకుముందు అండర్ -19 ప్రపంచకప్‌లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఐర్లాండ్ పర్యటనతో ప్రపంచ క్రికెట్లో తన ఆగమనాన్ని గొప్పగా చాటాలని వైభవ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ భారత క్రికెట్లో వైభవ్ విజయవంతం అవుతాడని అంటున్నాడు. మేటి ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలు సాధించిన రికార్డుల కంటే ఎక్కువే సూర్యవంశీ ఖాతాలో చేరుతాడని స్టెయిన్ చెబుతున్నాడు.
🚨 DALE STEYN ON VAIBHAV SURYAVANSHI 🚨
Dale Steyn said – “Vaibhav Suryavanshi is different gravy man. He’s better than most international players right now. He’s a boywonder, a treasure for India. He’s going to be bigger than Sachin Tendulkar & Virat Kohli put together at the…
— Cricket Central (@CricketCentrl) June 12, 2026
స్వదేశంలో జరుగనున్న ఎస్ఏ20 ఐదో సీజన్ సన్నాహకాల గురించిన చర్చ సందర్బంగా స్టెయిన్ మాట్లాడుతూ.. ‘అండర్ 15, అండర్ 19 క్రికెట్లో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. వీరిలో వైభవ్ సూర్యవంశీ చాలా ప్రత్యేకమైన క్రికెటర్. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న చాలామంది కంటే అతడు ఎంతో ఉత్తమం. అద్భుతమైన ఈ కుర్రాడు భారత క్రికెట్‌కు ఆస్తి’ అని పేర్కొన్న స్టెయిన్.. వైభవ్‌ను జాగ్రత్తగా చూసుకోవడం బీసీసీఐకి ఓ సవాల్ అని హెచ్చరించాడు.
”విధ్వంసక ఆటతో ప్రపంచ స్థాయి బౌలర్లను వణికిస్తున్న వైభవ్‌ను భారత బోర్డు ఎలా చూసుకుంటుంది? అనేది నేను జాగ్రత్తగా గమనిస్తాను. అతడి బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్‌లో గొప్ప ఘనతలు సాధిస్తాడు. అదే సమయంలో అతడిపై ఒత్తిడి పడకుండా చూసుకోకున్నా.. సరైన దిశానిర్దేశం చేయకున్నా అతడిని భారత క్రికెట్ కోల్పోయే ప్రమాదముంది. వైభవ్ బంతిని అద్భుతంగా బాదుతున్నాడు. ఇప్పుడు మా దేశంలోని ఏ పదిహేనేళ్ల కుర్రాడు కూడా అతడిలా ఆడడం లేదు. కానీ, నా దృష్టిలో వైభవ్ దూకుడుకు రబడ అడ్డుకట్ట వేశాడు. అతడికి షార్ట్ బంతులు వేయడమే సరైంది’ అని స్టెయిన్ అన్నాడు.