హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): అక్రమంగా భారత్‌లోకి వచ్చిన త్రిపుర వ్యాపారవేత్త సంజిత్ దాస్ విడుదలకు అనుమతించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. సంజిత్ దాస్ విడుదల కోసం ఆయన తండ్రి నిర్మల్ దాస్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ ప్రవీణ్ కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ ప్ర త్యేక న్యాయవాది స్వరూప్ ఊరిళ్ల వాదన వినిపిస్తూ.. ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ సెప్టెంబర్‌లో సంజిత్ దాస్‌ను అదుపులోకి తీసుకున్నదని తెలిపారు. బంగ్లాదేశ్ పౌరుడిగా ఉన్న సంజిత్ దాస్ భారత పాస్‌పోర్టు పొందాడని, శంషాబాద్ నుంచి అబుదాబీకి వెళ్లేందుకు ప్ర యత్నిస్తుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారని వివరించారు. అనంతరం ఆయన తండ్రి పిటిషన్‌ను కొట్టివేసింది.