హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ప్రాంగణంలోని మొత్తం 29 కోర్టుల్లో జరిగే కేసుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోమవారం ఉదయం 10.15 గంటలకు సీజే అలోక్ అరాధే ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి జరిగే కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని హైకోర్టు రిజిస్ట్రార్ తెలిపారు. కొవిడ్ వ్యాప్తి సమయంలో హైకోర్టు కేసుల విచారణ లైవ్ మొదలైంది. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన తర్వాత హైబ్రీడ్ పద్ధతిలో కేసుల విచారణ జరిపింది. ఇప్పుడు అన్ని కోర్టుల్లోని కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం కానున్నది.