హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): నెట్‌ఫ్లిక్స్ నిర్మించిన బ్యాడ్‌బాయ్ మిలియనీర్స్ డాక్యుమెంటరీపై సత్యం కం ప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు అభ్యంతరం వ్యక్తం చేసిన వివాదాన్ని 3 వారా ల్లో పరిషరించాలని కింది కోర్టును హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ భీమపాక నగేశ్‌తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ కేసుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా బ్యాడ్‌బాయ్ మిలియనీర్స్ డాక్యుమెంంటరీ ఎపిసోడ్ నిర్మించిందని రామలింగరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేయాలన్న మధ్యంతర ఉత్తర్వు లను కొట్టేయాలని అప్పట్లో నెటిఫ్లిక్స్ హైకోర్టును ఆశ్రయించింది.