హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాల్లోని లిఫ్టుల్లో ప్రజలకు భద్రత కల్పించే చట్టాన్ని రూపొందించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తున్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం ప్రతిసారీ వాయిదా కోరడమే తప్ప చట్టాన్ని మాత్రం తీసుకురావడం లేదని ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చే వరకు లిఫ్టుల్లో భ ద్రతపై అధ్యయనం చేయాలని, భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలను అందజేయాలని పిటిషనర్‌ను ఆదేశించిం ది.
లిఫ్టుల ఏర్పాటు, నిర్వహణలో నిబంధనలు అమలు చేయకపోవడంతో పలుచోట్ల పిల్లలు, పెద్దల ప్రాణాలు పోతున్నాయని హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్వాసి బ రత్ అలీఖాన్ మార్చిలో రాసిన లేఖను హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం ప్ర జాహిత వ్యాజ్యంగా పరిగణించి, బుధవా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ.. లిఫ్టుల్లో ప్రమాదాల నివారణకు చట్టాన్ని రూపొందించాలని ప్రభు త్వం యోచిస్తున్నట్టు చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. కనీసం ముసాయిదా బిల్లునై నా రూపొందించారా అని ప్రభుత్వాన్ని ప్ర శ్నించింది. ఇప్పటివరకు ఏమీ చేయకపోతే ప్రమాదాల నివారణకు కనీసం మార్గదర్శకాలైనా ఉండాలి కదా అని నిలదీసింది. మార్గదర్శకాలను సమర్పిస్తానని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పడంతో విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.