హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): డీసీఎంఎస్లకు పర్సన్ ఇన్చార్జీలుగా పాత డైరెక్టర్లనే కొనసాగించాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీచేసింది. పర్సన్ ఇన్చార్జీలను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 75 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీచేసింది. డీసీఎంఎస్లకు పర్సన్ ఇన్చార్జీలుగా అదనపు కలెక్టర్లను నియమిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 14న జారీ చేసిన జీవో 75, సహకార శాఖ కమిషనర్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉమ్మడి జిల్లాలకు చెందిన ఖమ్మం మినహా మిగతా 8 జిల్లాల డీసీఎంఎస్ డైరెక్టర్లు హైకోర్టులో వేర్వేరుగా 8 పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే శరత్ విచారణ చేపట్టారు.