హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా అమ్ముకుని తినేశారని తీవ్ర వ్యా ఖ్యలు చేసింది. తెలంగాణలో పేదలకు భూములను ఇచ్చిన ఎందరో గొప్పవాళ్లు ఉన్నారని, సీలింగ్ చట్టం అమల్లోకి వచ్చినపుడు మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 500 ఎకరాలు ఇచ్చారని కొనియాడింది. భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు అందరూ విఫలమయ్యారని వ్యాఖ్యానించింది.
భూదా న్ భూములంటూ ఆర్డీవో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన అప్పిలేట్ ట్రిబ్యునల్.. ఆ తరువాత కలెక్టర్ హోదాలో ఆయనే వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీచేయడంపై విస్మయం వ్యక్తంచేసింది. నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. గత కలెక్టర్ ఇప్పటికే పలు కేసుల విచారణను ఎదురొ ంటున్నట్టు పత్రికల్లో వార్తలు చదివామని, అధికారులపై ఆరోపణలు ఉన్నపుడు కోర్టు కు సమాధానం చెప్పి తీరాలని స్పష్టంచేసింది.
10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందినదని ధ్రువీకరించాక వారసత్వ ధ్రువీకరణ పత్రం ఎలా జారీచేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, భూదాన్ యజ్ఞ బోర్డ్డు, వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ అమోయ్‌కుమార్, డీఆర్వో ఆర్పీ జ్యోతి సహా మరో ఇద్దరికి నోటీసులను జారీచేసింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నా గారం గ్రామం సర్వే నం.182లో 10.29 ఎకరాలపై ఖాదర్ఉన్నీసాబేగంకు వారసత్వ ధ్రువీకరణ పత్రం జారీ చేయడాన్ని సవాలు చేస్తూ ఆ భూమిలో వాటా ఉన్న నవాబ్ పూర్అలీఖాన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి గురువారం విచారణ జరిపారు. ఆ భూ ములపై యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. విచారణను 28కి వాయిదా వేసింది.