హైదరాబాద్, ఆగస్టు 6, నమస్తే తెలంగా ణ: రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలు, విచారణ ఖైదీల వివరాలను నివేదించాలని జైళ్ల శాఖను హైకోర్టు పీపీ కార్యాలయం కోరింది. ఖైదీల ఆరోగ్య స్థితిగతులు, బెయిల్ పిటిషన్ల పరిస్థితి, వివరాలన్నింటినీ ఇవ్వాలంటూ లేఖ రాసింది. ఇటీవల ఓ కేసులో నిర్దోషిగా తీర్పు వచ్చిన నిందితుడు పోచయ్య అప్పటికే జైలు లో మరణించాడు. ఈ విషయం కోర్టు దృష్టికి రాలేదు. ఫలితంగా కోర్టులపై జనానికి తేలిక భావన ఏర్పడే అవకాశం ఉంటుందని ఖైదీల వివరాలను పీపీ కార్యాలయం కోరింది.
14 జిల్లాలకు ఇన్చార్జి డీఐఈ
వోలుహైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 14 జిల్లాలకు ఇన్చార్జి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్(డీఐఈవో)ను నియమిస్తూ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల పలువురు ప్రిన్సిపాళ్లు బదిలీ కాగా, ఇన్చార్జి డీఐఈవోలుగా వ్యవహరిస్తున్న వారికి స్థానచలనం కలిగింది. ఈ నేపథ్యంలో ఇన్చార్జి డీఐఈవోలను నియమించారు. కొత్తగా నియమితులైన డీఐఈవో లు ఆయా జిల్లాల్లో వెంటనే బాధ్యతలు స్వీక రించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో పెరిగిన వలస పులులు
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగా ణ): అడవుల జిల్లా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం, ఆవాసం కోసం జిల్లాలోని అడవుల్లోకి వస్తుండటంతో కాగజ్‌నగర్ కారిడార్‌లో పులుల సంచారం పెరిగింది. జి ల్లా కేంద్రానికి 5 కిమీ దూరంలోని గోవింద్పూర్, గుండి, కేస్లాపూర్‌లోని పంట చేన్లలో పెద్దపులి సంచరించడంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. సమీప పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎఫ్ఆర్వో గో వింద్చంద్, డీఆర్వో యోగేశ్, ఎఫ్ఎస్వో విజ య్ క్షేత్రస్థాయిలో పరిశీలించి పెద్దపులి పాదముద్రలుగా నిర్ధారించారు. గోవింద్పూర్ మీ దుగా జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వెనుక నుంచి పెద్దవాగు దాటి కాగజ్‌నగర్ మండలం అంకుషాపూర్ వైపు వెళ్లి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.