హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అమనగల్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అమనగల్ జూనియర్ కాలేజీ మైదానంలో ఈనెల 18న ఉదయం 11 నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు 3 వేల మందితో సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరు చేసిం ది. నేర చరిత్ర ఉన్నవారిని సభకు అనుమతించొద్దని, రెచ్చగొట్టే ప్రసంగాలు, మత, రాజకీయపరమైన ప్రకనటనలు చేయరాదని, ఎలాం టి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు షరతులు విధించింది. ఒకవేళ అవాంఛనీయ ఘటనలేమైనా జరిగితే బాధ్యుల వివరాలను పోలీసులకు అందజేయాలని స్పష్టం చేసింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.