హైదరాబాద్ : విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ప్రకారం ఆదాయపు పన్నుశాఖకు చెల్లించిన మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్(ఎంఏటీ) రూ.24.39 కోట్లు రాబట్టుకోవాలన్న జీవీకే గౌతమి పవర్ లిమిటెడ్(ఆర్‌ఎస్‌పీఎల్)కు హైకోర్టులో చుకెదురైంది. ఆదాయపు పన్ను శాఖకు చెల్లించిన సొమ్మును వాపసు ఇచ్చేలా ఏపీ ట్రాన్స్‌కోకు ఆదేశాలివ్వాలంటూ దాఖలు చేసిన పదేండ్ల్లనాటి పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
ఏపీఈఆర్సీ ఉత్తర్వులతోపాటు ఏపీకి చెందిన కార్యకలాపాలపై తెలంగాణ హైకోర్టుకు పరిధిలేదంటూ పిటిషన్‌ను రూ.లక్ష జరిమానాతో కొట్టివేశారు. దివాలా ప్రక్రియలో రెజల్యూషన్ ప్రొఫెషనల్ ముందు దరఖాస్తు చేయకుండా ఉదాసీనంగా ఉన్న విద్యుత్తు అధికారులపై విచారణ చేపట్టాలంటూ ఏపీ, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీలకు ఆదేశాలు జారీ చేశారు.