హైదరాబాద్, జూన్ 20(నమస్తే తెలంగాణ): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్‌రెడ్డి మంగళవారం పదవీవిరమణ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్‌కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన న్యాయమూర్తులంతా సమావేశమై ఘనంగా వీడ్కోలు పలికారు. జస్టిస్ సంతోష్‌రెడ్డి పలు కీలక తీర్పులు వెలువరించారంటూ సీజే కొనియాడారు.
కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్జీల చాంబర్లో జస్టిస్ సంతోష్‌రెడ్డి దంపతులను సీజే దంపతులు సత్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జస్టిస్ సంతోష్‌రెడ్డి దంపతులను సన్మానించారు.