హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో వ్యవసాయ మిగుల భూ ముల గరిష్ఠ పరిమితి చట్టం (ల్యాండ్ సీలింగ్ యాక్ట్) అమలుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణాలో 1973 నాటి భూసంసరణల (వ్యవసాయ మిగులు భూముల సీలింగ్) చట్టాన్ని అమలు చేయడం లేదంటూ మెదక్ జిల్లాకు చెందిన సింగూరు జలసాధన కమిటీ అధ్యక్షుడు కంచరి బ్రహ్మం హైకోర్టుకు లేఖ రాశారు. ‘చట్టంలోని మినహాయింపులను సాకుగా తీసుకున్న ప్రభుత్వం కంపెనీల పేరుతో భూముల కొనుగోలుకు ఆసారం కల్పించింది. వ్యక్తిగత పరిమితికి మించి భూములను కంపెనీల పేరుతో కొనుగోలు చేస్తున్నారు. భూములు కొందరి చేతుల్లోనే ఉండటంతో వాటి ధరలకు రెకలొచ్చాయి. భూమి సాగు తగ్గింది. రైతులు కూలీలుగా మారుతున్నారు. రెతులు భూములను కొనుగోలు చేసే పరిస్థితులు కూడా లేవు. సంపన్నులకే భూములు దకాయి. అని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిని ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించిన హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్‌పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.