Hyderabad | హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌తో పాటు రద్దీ ప్రాంతాల్లో బాంబు, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ నగరంలో ఉంటున్నాయి. నగరంలో విధ్వంస చర్యలు తగ్గినా.. ఎన్ఐఏ, వివిధ రాష్ట్రాల పోలీసుల సోదాల్లో నగరానికి చెందిన వ్యక్తులు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఉగ్రమూలాలు కలిగి ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇందులో రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ ఉన్న విషయం విదితమే.