Actor Srikanth | ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ ఆదివారం వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వరస్వామి, పార్వతీ అమ్మవార్లకు ఆయనతో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. ఆ తర్వాత ఆలయ అధికారులు ఆశీర్వచన మండపంలో అర్చకులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్తీకమాసంలో ఉపవాసాలు, ప్రత్యేక పూజల అనంతరం స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తొలిసారిగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి చాలా ఆనందంగా ఉందన్నారు. త్వరలో రామ్ చరణ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండగకి జనవరి 10న రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే, కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ మూవీలో నటిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే, సోలోగా మరో సినిమాలోనూ నటిస్తున్నానన్నారు. తన తనయుడు రోషన్ ‘ఛాంపియన్’ మూవీలో హీరోగా నటిస్తున్నాడని.. ఈ మూవీని ప్రముఖ సినీ నిర్మాత స్వప్న దత్ నిర్మిస్తున్నట్లు చెప్పారు.