Traffic | హైదరాబాద్ : దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి హైదరాబాద్ నగరానికి ప్రజలు తిరుగు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నగరానికి వచ్చే అన్ని రహదారులు వాహనాలతో రద్దీగా మారాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
కార్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రయివేటు వాహనాలు ఒకదాని వెంట మరొకటి బారులు తీరాయి. దీంతో చిట్యాల, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజా వద్ద రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు ప్రయాణికులతో ఆర్టీసీ, ప్రయివేటు బస్సులు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను పోలీసులు క్రమబద్దీకరిస్తున్నారు.