హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్య అరేరబియా సముద్రం నుంచి రాయలసీమ, ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడినట్లు పేర్కొంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
కాగా, నగరంలో పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్‌పేట, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ముషీరాబాద్, అంబర్‌పేట, కాచిగూడ, ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు రహదారులు జలయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.