హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): అరేబియా సముద్రంలో ఏర్పడిన లానినో ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. దీనికితోడు తిరోగమన దశలో ఉన్న నైరుతి రుతుపవనాలు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. వారం రోజుల్లో తెలంగాణ నుంచి ఈ రుతుపవనాలు తిరోగమించవచ్చని వివరించారు. ఇప్పటివరకు గత ఏడాది అక్టోబర్‌లో 25.4 మిల్లీమీటర్ల వర్షం కురువగా, ఈసారి 53 మిల్లీమీటర్ల వర్షం పడినట్టు తెలిపారు. ఆగ్నేయ, తూర్పు దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని చెప్పారు. ఈ నెల 12,13న హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించారు.