AP news | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా వలసపాకలోని ఎస్ కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో సెల్‌ఫోన్ మాయమైన ఘటనలో విద్యార్థులు రెచ్చిపోయారు. రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, బకెట్లు చేతికి ఏది దొరికతే దానితో దాడికి పాల్పడ్డారు. దీంతో హాస్టల్ పరిసరాలు యుద్ధభూమిగా మారిపోయాయి. స్థానిక విద్యార్థినులు, నార్త్ ఈస్ట్ విద్యార్థినుల మధ్య జరిగిన చిన్న గొడవ కాస్తా దాడి చేసుకునేవరకు వెళ్లింది. మణిపూర్ మాజీ సీఎం బీరేందర్ సింగ్ జోక్యం చేసుకునే వరకు వెళ్లింది. సమస్యను పరిష్కరించాలని ఆయన ట్వీట్ చేయడంతో రంగంలోకి దిగిన ఏపీ అధికారులు ఇరువర్గాలను సముదాయించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల హాస్టల్ మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయనే ఆరోపణలతో ఈ వివాదం మొదలైంది. ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులు గాయపడడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసులు, కాలేజీ సిబ్బంది తటస్థంగా వ్యవహరించలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి విద్యార్థులందరికీ సమాన రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, స్టూడెంట్స్ కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబాబు నాయుడు ఆరా తీశారు. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
BREAKING ⚡
🚨NORTHEAST STUDENTS ATTACKED BY MOB AT SK COLLEGE OF NURSING, ANDHRA PRADESH @AndhraPradeshCM
22 August 2026
📍Valasapakala, Kakinada—A scuffle reportedly broke out between Northeast and local girl students following allegations of stolen mobile phones… pic.twitter.com/HN8X6ZfRsW
— 📍SHANGH CHE🚭 (@JosephNaga1986) August 22, 2026