అధిక వర్షాల కారణంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. ఎస్.ఆర్.ఎస్.పి ప్రాజెక్టు నుండి అధికంగా వరద నీరు రావటంతో ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో పెరిగింది. ఎస్.ఆర్.ఎస్.పి ప్రాజెక్టు నుండి అధికంగా 1,73,578 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టుకు వచ్చిచేరుతుంది.
కడెం ప్రాజెక్టు నుండి 11 వేల క్యూసెక్కుల వరద నీరు, వర్షం ద్వారా 71 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,55,707 క్యూసెక్కులు కాగా అధికారులు 35 గేట్లు తెరిచి 3,46,846 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 16.7912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.