హైదరాబాద్, ఫిబ్రవరి20 (నమస్తే తెలంగాణ): జలవిద్యుత్తు ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలని ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏప్రిల్ 30కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పుడే తుది వాదనలను వింటామని ఇరు రాష్ర్టాలకు సూచించింది. ఏపీ దాఖలు చేసిన ఆ పిటిషన్పై జస్టిస్ అయ్ఏస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘమైన వాదనలు వినిపించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో మరోరోజుకు కేసు విచారణను వాయిదా వేయాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు.
వాలంతరికీ రూ.3.79 కోట్లు
వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (వాలంతరీ) నిర్వహణకు ప్రభుత్వం రూ.3.79 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.