హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ అదే శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉద్యోగోన్నతి పొందారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమావేశం నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ టీఎస్ డిమాండ్ చేసింది. ఈమేరకు బుధవారం హైదరాబాద్లో ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ సదానందం గౌడ్, జుట్టు గజేందర్ డిమాండ్ చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.