కాచిగూడ, మార్చి 13: హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫర్ సేఫ్టీ, ఇంజినీరింగ్ సంస్థ డైరెక్టర్ అడపా వెంకట్రెడ్డి సూచించారు.
సోమవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కో ర్సుల్లో శిక్షణ పొందిన వారికి మంచి అవకాశాలు ఉంటాయని తెలిపారు. వివరాలకు www.ncttindia.com లేదా 6302355872కు సంప్రదించాలని కోరారు.