హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల డ్రాప్ అవుట్స్‌ను తగ్గించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. మంగళవారం సెక్రటేరియట్లో ఇంజినీరింగ్, మెడికల్ తదితర కోర్సుల్లో విద్యార్థులకు వచ్చిన సీట్లు, ఇతర అంశాలపై సమీక్షించారు.
విద్యార్థులు ఆత్మన్యూనతకు లోనుకాకుండా చూడాలని, ఇందుకు సైకాలజిస్టులతో క్లాసులు చెప్పించాలన్నారు.