హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్- తిరుపతి, హైదరాబాద్- నాగర్సోల్, నర్సాపూర్-యశ్వంత్పూర్ రైల్వేస్టేషన్ల మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఈ ప్రత్యేక రైళ్ల రాకపోకలు ఉంటాయని చెప్పారు.