హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): అతి తక్కువ సమయంలోనే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ద్వారా సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశం కూడా నంబర్ వన్ స్థాయికి చేరుతుందని బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర అన్నారు. దేశంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటం కోసం, అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధికి, సామాజిక న్యాయానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభ పరిణామమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. యాదవులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి ఉచిత గొర్రెల పంపిణీ, మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల కోసం వెయ్యికి పైగా గురుకులాలతో నాణ్యమైన విద్య, భోజనం అందిస్తూ పేద వర్గాల ప్రజలకు అవకాశాలు కల్పిస్తున్నారని తెలిపారు.
దేశమంతా సీఎం కేసీఆర్ నాయకత్వం కో సం ఎదురుచూస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసిం గ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. స్వరాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా జరిగిన అభివృద్ధిని చూసి దేశం ఆశ్చర్యపోతున్నదని, ఇదే తరహా అభివృద్ధి తమకూ కావాలని ఇతర రాష్ట్రాల వారూ కోరుకుంటున్నారని శనివారం ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని పేర్కొన్నారు.