హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): చెరువుల ఆక్రమణలకు సహకారం అందించారని ఆరోపిస్తూ హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బాచుపల్లి ఎమ్మార్వో కు హైకోర్టులో ఊరట లభించింది.ఆయనకు గురువారం ముంద స్తు బెయిలు మంజూరు చేసింది. నిజాంపేట మున్సిపాలిటీ, ప్రగతినగర్లో మూడు ఎకరాల్లోని ఎరక్రుంట ఆక్రమణలకు సహకరించారనే కేసులో పిటిషనర్ రెండో నిందితుడిగా ఉన్నారు.
నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, బాచుపల్లి ఎమ్మార్వో పూల్సింగ్, సర్వే శాఖ సహాయ డైరెక్టర్ కే శ్రీనివాసులు, సహాయ ప్లానింగ్ అధికారి సుధీర్కుమార్పై ఆగస్టు 30న కేసు నమోదైంది. పూల్సింగ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ కే సుజన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. పూల్సింగ్ 2023 ఆగస్టులో ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టారని, అప్పటికే అనుమతులు జారీ అయ్యాయని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు.