సలం చెరువు ఆక్రమణలపై స్పష్టత ఇవ్వరా?
హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారం లో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తంచేసింది. సలం చెరువు ఎఫ్‌టీఎల్‌తోపాటు ఆక్రమణలు, విద్యాసంస్థల నిర్మాణాలకు, తరగతుల నిర్వహణకు అనుమతులు, బాధ్యులైన అధికారులపై చర్యలు తదితరాలపై నివేదికలు సమర్పించాలంటూ ఆయా శాఖలకు మూడు నెలలు గ డువు ఇచ్చినా స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్ర హం వ్యక్తంచేసింది.
- మూడు నెలలైనా కనీసం స్పందించరా?
- అధికారులను నిలదీసిన హైకోర్టు
- వారంలోగా ఇవ్వాల్సిందే.. లేదంటే ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పరిధిలోని సలం చెరువులో బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల వ్యవహారం లో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సలం చెరువు ఎఫ్‌టీఎల్‌తోపాటు ఆక్రమణలు, విద్యాసంస్థల నిర్మాణాలకు, తరగతుల నిర్వహణకు అనుమతులు, బాధ్యులైన అధికారులపై చర్యలు తదితరాలపై నివేదికలు సమర్పించాలంటూ ఆయా శాఖలకు మూడు నెలలు గ డువు ఇచ్చినా స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. చివరిగా మరో వారం గ డువు ఇస్తున్నామని, 9లోగా నివేదికలు దాఖ లు చేయని పక్షంలో ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది.
సలం చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఒవైసీ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది విజయ్‌గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రావణ్‌కుమార్ శుక్రవారం మరోసారి విచారణ చేపట్టారు. విద్యాశాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ సంస్థలో తరగతుల నిర్వహణకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదని తెలిపా రు. హెచ్ఎండీఏ తరఫు న్యాయవాది వాదన లు వినిపిస్తూ ఆ చెరువు లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. సలం చెరువులోని అక్రమ నిర్మాణాలకు సంబంధించి అన్ని శాఖల నుంచి రావాల్సిన పత్రాల కోసం చూస్తున్నామని హైడ్రా తరఫు న్యాయవాది చెప్పారు. ఎఫ్టీఎల్ నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది చెప్పారు. హైకోర్టు ఉత్తర్వుల అమలుకు మరో 4 వారాల గడువు కావాలని కోరారు.
నీటిపారుదల శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మే 15న ఉమ్మడి తనిఖీ నిర్వహించామని, రెవెన్యూ అధికారుల నుంచి సెచ్ అడిగామని, అది వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. పిటిషనర్ తరఫు న్యా యవాది అభ్యంతరం వ్యక్తంచేస్తూ 2016 లోనే ఎఫ్టీఎల్ నిర్ధారణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయిందని తెలిపారు. దీని ప్రకా రం 34.25 ఎకరాల్లో చెరువు ఉందని, ఎఫ్టీఎల్ పరిధిని 39.30 ఎకరాలకు పెంచారని చెప్పారు. రెవెన్యూశాఖలోని పహాణీ ప్రకారం సర్వే నం.62/1లో 36.3 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉన్నదని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. నివేదికలు సమర్పించడానికి మరో వారం గడువు ఇస్తున్నామని, ఒకవేళ దాఖలు చేయకపోతే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందంటూ విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

