గౌలిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన దత్తన్న
Bandaru dattatreya | హనుమాన్ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నగరంలోని గౌలిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీర హనుమాన్ విజయ యాత్రలో
హైదరాబాద్: హనుమాన్ జయంతి సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నగరంలోని గౌలిగూడ రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీర హనుమాన్ విజయ యాత్రలో భాగంగా నిర్వహించిన హోమంలో పాల్గొన్నారు. అనంతరం దత్తన్న మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారని చెప్పారు. హనుమంతుడు శక్తిశాలి అని, యువత ఆంజనేయుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రామరాజ్య స్థాపనకు ఇలాంటి యాత్రలు దోహదం చేస్తాయని తెలిపారు.

కాగా, హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని 21 మార్గాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కర్మాన్‌ఘాట్ నుంచి కోఠి వరకు, గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
శోభాయాత్ర సాగే మార్గాలు..
గౌలిగూడ శ్రీరామమందిరం నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర పుత్లిబౌలి ఎక్స్‌రోడ్స్, ఆంధ్రా బ్యాంక్
ఎక్స్‌రోడ్స్, కోఠి, తిలక్‌రోడ్, సుల్తాన్‌బజార్, రాంకోఠి, కాచిగూడ ఎక్స్‌రోడ్స్, నారాయణగూడ, చిక్కడపల్లి
ఎక్స్‌రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి అశోక్‌నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్
వెనుక వైపు నుంచి, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట్, బైబుల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా
షోరూం మీదుగా ఉజ్జయినీ మహంకాళి ఆలయం, రామ్‌గోపాల్‌పేట్ పీఎస్, ప్యారడైజ్ ఎక్స్‌రోడ్స్, సీటీవో
జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్ బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కేఫ్ నుంచి ఎడమ వైపు మీదుగా
తాడ్బండ్లోని శ్రీహనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. 12 కిలోమీటర్లు కొనసాగే ఈ యాత్ర రాత్రి 8
గంటల వరకు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
అదేవిధంగా, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయం నుంచి వస్తున్న మరో ర్యాలీ చంపాపేట్ ఎక్స్‌రోడ్స్, ఐఎస్
సదన్, దోబిఘాట్, మలక్‌పేట్ ఏసీపీ ఆఫీస్, సైదాబాద్ కాలనీ రోడ్డు, సరూర్‌నగర్ ట్యాంక్, కొత్తపేట,
దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, నల్లగొండ క్రాస్‌రోడ్డు, చాదర్‌ఘాట్ నుంచి కోఠి డీఎం అండ్ హెచ్ జంక్షన్
వద్దకు చేరుకొని అక్కడ ప్రధాన ర్యాలీలో కలుస్తుందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
IPL | బిగ్ బ్రేకింగ్.. ఐపీఎల్ ‘సమీక్ష’ సమావేశం వాయిదా..!
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

