హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : హరితనిధి సెస్‌ను సమీకరించేందుకు ఆయా శాఖలు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇరిగేషన్ శాఖ పనులపై రూ.0.01 శాతం, ప్లానింగ్ శాఖ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో 10 శాతం, రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కో రిజిస్ట్రేషన్‌పై రూ.50, దుకాణాల లైసెన్సుల రెన్యువల్‌పై రూ.1000, విద్యార్థుల అడ్మిషన్లలో పదో తరగతి వరకు రూ.10, ఇంటర్మీడియట్‌కు రూ.15, డిగ్రీకి రూ.25, ప్రొఫెషనల్ కోర్సులకు రూ.100 చొప్పున సమీకరించాలని సూచించారు.