సంగారెడ్డి : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గతంలో స్వయంభూ సిద్ధివినాయక ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రేజింత్లో స్వయంభూ సిద్ధివినాయక 225వ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ పాలక మండలి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..స్వయంభూ సిద్ధి వినాయక జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
సిద్ధి వినాయకుడు దినదినము ఆకారం పెంచుకుంటూ ఇక్కడికి వచ్చే భక్తుల కోరికలు నెరవేరుస్తూ వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, ఆస్ట్రేలియా నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం సిద్ధి వినాయక జయంతి ఉత్సవాలు గొప్పగా జరగడం సంతోషకరమైన విషయం. స్వామివారి పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొనడం మరింత సంతోన్ని చ్చిందన్నారు. ఇలాంటి విశిష్టత ఉన్న సిద్ధి వినాయకుడిని మరెక్కడా మనం చూసి ఉండమన్నారు. నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించానన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నేతలు, తదితరులు ఉన్నారు.