నిరుద్యోగుల అరెస్ట్ సిగ్గుచేటు
సమస్యలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం అందజేసిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
- సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఆగ్రహం
- ఏఈఈ పరీక్ష వాయిదాకు డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): సమస్యలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం అందజేసిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఇంజినీరింగ్ ఉద్యోగ అభ్యర్థులు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఒకే రోజు కేంద్ర పరిధిలోని ఎస్ఎస్ సీజేఈ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఉండటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం.. దయచేసి ఏఈఈ పరీక్షను వాయిదా వేయించి ఉద్యోగావకాశాలు కాపాడండి‘ అంటూ హరీశ్‌రావుకు విన్నవించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా హరీశ్‌రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఒకే తేదీన రెండు ప్రధా న పోటీ పరీక్షలు ఉండటంతో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందుతూ పరీక్షను వాయిదా వేయాలని న్యాయబద్ధంగా కోరడమే నిరుద్యోగ యు వత చేసిన నేరమా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పాలకుల అహంకా రం, వ్యక్తిగత పంతాలు, పట్టింపుల కంటే నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్తే అత్యంత ముఖ్యమైనదని హితవు పలికారు. పాలకులు తమ భేషజాలకు పోయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడవద్దని హెచ్చరించారు. అక్రమంగా నిర్బంధించిన అభ్యర్థులను, విద్యార్థి నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజినీర్ పరీక్ష, రాష్ట్ర ప్రభుత్వ సహాయక ఇంజినీర్ పరీక్ష ఒకే తేదీన(నవంబర్ 6న) ఉండటం వల్ల వేలాది మంది స్థానిక యువత ఉపాధి అవకాశాలు కోల్పోవల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇతర రాష్ట్రాల్లో కేంద్ర నియామక పరీక్షను రాసే అభ్యర్థులు అదే రోజు తిరిగి సొంత రాష్ట్రానికి వచ్చి సహాయక ఇంజినీర్ పరీక్షకు హాజరుకావడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల ఉద్యోగావకాశాలు తుంచేసేలా వ్యవహరించవద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డికి, హరీశ్‌రావు శనివారం బహిరంగ లేఖ రాశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

