దివ్యాంగుల పొట్టకొట్టడం దుర్మార్గం
దివ్యాంగులు, పేద మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేండ్లుగా బిల్లులు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదా బేగం దివ్యాంగ్ సోలార్ సొసైటీ, దివ్యాంగ్ గార్మెంట్స్ పేరిట సంస్థను నడుపుతూ దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు.
- మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగులు, పేద మహిళలకు జీవనోపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేండ్లుగా బిల్లులు చెల్లించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదా బేగం దివ్యాంగ్ సోలార్ సొసైటీ, దివ్యాంగ్ గార్మెంట్స్ పేరిట సంస్థను నడుపుతూ దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు.
ఎస్సీ గురుకుల విద్యార్థులకు దుస్తులు కుట్టి సరఫరా చేసినందుకు గాను రావాల్సిన రూ.16 లక్షల బిల్లులు రెండేండ్లుగా నిలిచిపోయి సిబ్బందికి వేతనాలు ఇవ్వలేక, బ్యాంకుల రుణాల వాయిదాలు కట్టలేక సంస్థకు తాళాలు వేసే దుస్థితి దాపురించిందని ఆదివారం ‘ఎక్స్’ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. రెకల కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్న వారి పొట్టకొట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

