హైదరాబాద్, మే 13(నమస్తే తెలంగాణ) : ‘నేను కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న కొడుకు స్నాతకోత్సవానికి హాజరుకావడం ఆనందంగా ఉన్నది..’ అంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు బుధవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
ఆ క్షణాలు తమ కుటుంబానికి ప్రత్యేకమైనవి, ఆ సందర్భం గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే కొన్ని రోజులు అందుబాటులో ఉండనని ప్రకటించారు.