సిద్దిపేట : యువత విద్యతో పాటు క్రీడా నైపుణ్యం పెంపొందించుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. జిల్లాలోని నంగునూర్ మండలం పాలమాకుల గ్రామ యూత్ ఆధ్వర్యంలో THR సీజన్ -2 వాలీబాల్ టోర్నమెంట్(Volleyball tournament)లో గెలుపొందిన వారికి క్యాంప్ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేసారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమన్నారు. యువత క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. అన్ని రంగాల్లో ముందుండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.