మీటింగ్ ఎజెండా నిజమా? మీరు చెప్పింది నిజమా?
కృష్ణా నీటి వినియోగం విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు ప్రచా రం చేస్తూ, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు
- కృష్ణా నీళ్లపై ఉత్తమ్ సమాధానం చెప్పు
- అఖిలపక్షంలోనూ మంత్రివి అవే అబద్ధాలు
- కృష్ణా నీళ్లను తక్కువ వాడుకున్నది కాంగ్రెస్ సర్కారే
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తేతెలంగాణ) : కృష్ణా నీటి వినియోగం విషయంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాలు ప్రచా రం చేస్తూ, తమ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. ‘కేఆర్ఎంబీ మీటింగ్ ఎజెండాలో పేరొన్నది నిజమా? మీ ట్వీట్ నిజమా? సమాధానం చెప్పండి’ అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. నీళ్ల వినియోగంపై కేఆర్ఎంబీకి ఒక లెక, తెలంగాణ ప్రజలకు మరో లెక ఎలా చెప్తారు? అని నిలదీశారు. 21వ కేఆర్ఎంబీ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన అధికారిక అజెండాలో 2026 సెప్టెంబర్ 21 నాటికి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్ 45.791 టీఎంసీల నీటిని బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించగా, తెలంగాణ మాత్రం ఎంజీకేఎల్ ఐఎస్ ద్వారా బేసిన్ పరిధిలోని ప్రాంతాల అవసరాల కోసం కేవలం 10.653 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించినట్టు అజెండాలో పేరొన్న విషయాన్ని ప్రస్తావించారు.
ఎజెండాలో ఇలా ఉంటే మీరు మరో లెక చెప్తున్నారు? ఈ రెండింటిలో ఏది నిజం? ఏది తప్పు? అని ప్రశ్నించారు. కేఆర్ఎంబీకి మీ ప్రభుత్వమే సమర్పించిన గణాంకాలు నిజమైతే, మీరు చేసిన ట్వీట్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్టే కదా అని దెప్పి పొడిచారు. ఉత్తమ్ గారూ కేఆర్ఎంబీని తప్పుదోవ పట్టిస్తున్నారా? ప్రజలను మభ్యపెడుతున్నా రా? అని నిలదీశారు. ‘ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై లేదా? కృష్ణా నీళ్లను అతి తకువగా వినియోగించింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమే. నీళ్లను ఒడిసి పట్టకుండా కిందకు విడిచిపెట్టి ఇప్పుడు కుంటి సాకులు చెప్తున్నారా?’ అని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

