జహీరాబాద్/హైదరాబాద్, జనవరి 14(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మీ ఖాకీ బుక్ ఏం చెప్తుందో ఒకసారి చూసుకోండి’ అని సూ చించారు. బుధవారం జహీరాబాద్ ఎమ్మె ల్యే క్యాంపు ఆఫీస్‌లో ఆయన విలేకరుల తో మాట్లాడారు. జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘గతంలో కేటీఆర్‌పై మీ మంత్రి అడ్డగోలు వ్యాఖ్యలు చేసినప్పుడు బాధపడ్డది కూడా ఒక మహిళే కదా? అప్పుడు మీ పోలీసు లేం చేశారు? మీ చట్టం నిద్రపోయిందా?’ అని ప్రశ్నించారు. అప్పుడు ఎందుకు సిట్ వేయలేదని ప్రశ్నించారు. జర్నలిస్టులు వా ర్త రాస్తే తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేస్తారని, కానీ కాంగ్రెస్ నేతలు బెదిరించినా కేసులు ఉండవని విమర్శించారు. మంత్రి కంపెనీ పేదోళ్ల భూమి కబ్జాచేస్తే, వారికి రక్ష ణ కల్పిస్తున్నారే తప్ప అరెస్ట్ చేయలేదని, నిజాయితీగా పనిచేసిన సీఐని మాత్రం బ దిలీ చేశారని మండిపడ్డారు. ఎన్‌హెచ్-44 కాంట్రాక్టర్‌ను కాంగ్రెస్ ఏఐసీసీ నేత సంపత్‌కుమార్ డబ్బులు కోసం బెదిరించారని 9న ఫిర్యాదు చేసినా అర్ధరాత్రి ఎం దుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ‘సిద్దిపేటలో నాపై కాంగ్రెస్ నాయకులు అనరాని మాటలు మాట్లాడారు. వారిపై ఫిర్యా దు చేసి ఇన్ని రోజులైనా కేసు నమోదు కా లేదు’ అని పేర్కొన్నారు. సీఎం సన్నిహితు డు రోహిన్‌రెడ్డి ఒక పారిశ్రామికవేత్త తలకు తుపాకీ పెట్టి డబ్బులు వసూలు చేశాడని మంత్రి కూతురు మీడియాకు చెప్పినా సిట్ ఎందుకు వేయలేదని నిలదీశారు.
అక్రమంగా అరెస్టులతో మీడియా సం స్థలను తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని రే వంత్ ప్రయత్నిస్తున్నారని హరీశ్ విమర్శించారు. ‘మీడియా అంటే ఆయనకు ఎందు కో కోపం. జర్నలిస్టులను చూస్తే చెంపలు పగులగొట్టాలని అనిపిస్తుందని గతంలో మాట్లాడి, ఇప్పుడు, ఆ కసిని బయట పె ట్టుకున్నారు’ అని మండిపడ్డారు. జర్నలిస్టులేమైనా తీవ్రవాదులా? సంఘవిద్రో హ శక్తులా? నోటీసులిచ్చి విచారణ చేపట్టవచ్చన్నారు. అరెస్టులు, మీడియాపై సిట్లతో ఎవరిని కా పాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు?’ అని ప్రశ్నించారు.
శనివారాలు, అర్ధరాత్రుల్లో రేవంత్‌లో ని అరాచకవాది నిద్రలేచి పేదల ఇండ్లు కూలగొడతారని హరీశ్‌రావు ఎద్దేవా చేశా రు. హోం శాఖను అడ్డుపెట్టుకొని పోలీసులను ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. గతంలో అల్లు అర్జున్, మంత్రి సురేఖ ఇండ్ల మీదికి కూడా పంపి న ఘనత రేవంత్‌కే దక్కిందన్నారు. జర్నలిస్టులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారి పోరాటానికి బీ ఆర్ఎస్ మద్దతు ఉంటుందని ప్రకటించా రు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మె ల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఏంఏస్ చైర్మన్ శివకుమార్ ఉన్నారు.
రాష్ట్రంలో జర్నలిస్టుల వరుస అరెస్టుల విషయమై డీజీపీతో హరీశ్ ఫోన్లో మా ట్లాడారు. ‘నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి.. పండుగ పూట జర్నలిస్టులను ఎలా అరెస్టులు చేస్తారు? జర్నలిస్టులేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు? ఎందుకంత కఠినంగా వ్యవహరిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. వాళ్ల కుటుంబాలు మానసిక వేదనకు గురవుతాయని, పండుగ పూట అరెస్టులు సరికాదని సూచించారు.