ఏపీ జలదోపిడీపై రేవంత్ మౌనమెందుకు?
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. నీటి కేటాయింపులు లేకున్నా, వరద జలాలు రాకున్నా, ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు.
- మన ప్రాజెక్టులు ఎండిపోతుంటే.. బేసిన్ దాటి కృష్ణా నీళ్ల తరలింపు
- పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి రైతాంగానికి కాంగ్రెస్ సరార్ ద్రోహం
- కేఆర్ఎంబీ ఏం చేస్తున్నది? వెంటనే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించాలి
- ఎక్స్ వేదికగా హరీశ్‌రావు డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు విమర్శించారు. నీటి కేటాయింపులు లేకున్నా, వరద జలాలు రాకున్నా, ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి చేస్తున్న తీరని ద్రోహమని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్ఎంబీ తీరును సోమవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే.. మరోవైపు ఏపీ ప్రభుత్వం మన నీటి హకులపై దండెత్తి నీటిని అడ్డగోలుగా తరలిస్తున్నదని ధ్వజమెత్తారు.
నిబంధనలు ఉల్లంఘించి నీటి తరలింపు
ఒకవైపు కృష్ణా బేసిన్లో భాగమైన భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్లు ఎండిపోతుంటే.. మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ సర్కార్ నిబంధనలు ఉల్లంఘించి నీటిని తరలిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాలువ.. ఇప్పుడు వెలిగొండ. తెలంగాణకు దకాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారు? పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం ఇది.
ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కేఆర్ఎంబీ సైతం పట్టనట్టు వ్యవహరించడం దుర్మార్గం. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే.. రాష్ట్ర నీటి హకులను ఎవరు కాపాడాలి? కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెంటనే స్పందించాలి. కేఆర్ఎంబీపై ఒత్తిడి తెచ్చి, తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiaNew vs Zealand | తొలి టెస్టులో సత్తా చాటిన భారత బౌలర్లు.. బుమ్రా ఖాతాలో మూడో వికెట్.. కివీస్ 95/5
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

