పటాన్చెరు నుంచి వైకుంఠధామం వరకు..
జెండా మోసే కార్యకర్త నుంచి పార్టీ ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ నేతల ఇంట వేడుకలైనా, విషాద ఘటనలు చోటుచేసుకున్నా పార్టీ నాయకత్వం వెన్నంటే ఉంటున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తదితరులు పార్టీ శ్రేణులకు అన్నివేళలా కొండంత అండగా నిలుస్తూ వారి కష్టసుఖాలను పంచుకుంటారు.
- లాస్యనందిత కుటుంబసభ్యులకు అండగా
- రోజంతా వెన్నంటే ఉన్న హరీశ్‌రావు
- అంత్యక్రియల్లో పాడె మోసి తుదివీడ్కోలు
సంగారెడ్డి, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): జెండా మోసే కార్యకర్త నుంచి పార్టీ ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ. పార్టీ నేతల ఇంట వేడుకలైనా, విషాద ఘటనలు చోటుచేసుకున్నా పార్టీ నాయకత్వం వెన్నంటే ఉంటున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత తదితరులు పార్టీ శ్రేణులకు అన్నివేళలా కొండంత అండగా నిలుస్తూ వారి కష్టసుఖాలను పంచుకుంటారు. బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి వార్త తెలిసిన వెంటనే కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు. ఆమె నివాసానికి వెళ్లి భౌతికదేహానికి నివాళులర్పించారు.
కేసీఆర్ సూచనతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు లాస్య నందిత అంత్యక్రియలు పూర్తయ్యే వరకు వెన్నంటే ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత మృతిచెందారనే విషయం తెలిసిన వెంటనే హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి హుటాహుటిన బయలుదేరారు. పటాన్‌చెరులోని దవాఖానకు చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న లాస్యనందిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
ఆ తర్వాత భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించే సందర్భంలోనూ వెన్నంటే ఉన్నారు. మరో వాహనంలో అంబులెన్స్‌ను అనుసరిస్తూ గాంధీ దవాఖానకు చేరుకున్నారు. గాంధీ వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టం త్వరగా పూర్తయ్యేలా చూశారు. అక్కడి నుంచి లాస్యనందిత మృతదేహాన్ని సికింద్రాబాద్ కార్కానాలోని ఆమె నివాసానికి తరలించారు. అనంతరం లాస్యనందిత నివాసం నుంచి వెస్ట్‌మారేడ్‌పల్లిలోని వైకుంఠధామం వరకు అంతిమయాత్ర నిర్వహించగా హరీశ్‌రావు స్వయంగా పాడెను మోశారు. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. ఉదయం 8.30 గంటలకు పటాన్‌చెరులోని దవాఖానకు చేరుకున్న హరీశ్‌రావు.. రాత్రి 7.30 గంటలకు అంత్యక్రియలు పూర్తయ్యే వరకు లాస్యనందిత కుటుంబసభ్యుల వెన్నంటే ఉండటం పార్టీ శ్రేణులను కదిలించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

