మల్లన్నసాగర్‌పై సర్కార్ కుట్ర
‘మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూల్చేందుకు రేవంత్ ప్రభు త్వం కుట్ర చేస్తున్నది. కట్టకు 150 మీటర్లలోనే అర్ధరాత్రి వేళ అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ నీళ్ల కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట సమీపంలోనే 20 మీటర్ల లోతున అడ్డగోలు పేలుళ్లు చేస్తుండటంతో రిజర్వాయర్ కట్ట అదురుతున్నది.
- కట్టకు 150 మీటర్లలోపే అక్రమ బ్లాస్టింగ్స్
- ఎవరి అండతో జరుగుతున్నయ్?
- మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీత
- బ్లాస్టింగ్ ప్రాంతాల పరిశీలన.. మంత్రి ఉత్తమ్‌కు లేఖ
సిద్దిపేట, ఆక్టోబర్ 29( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గజ్వేల్: ‘మల్లన్నసాగర్ ప్రాజెక్టును కూల్చేందుకు రేవంత్ ప్రభు త్వం కుట్ర చేస్తున్నది. కట్టకు 150 మీటర్లలోనే అర్ధరాత్రి వేళ అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ నీళ్ల కోసం ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట సమీపంలోనే 20 మీటర్ల లోతున అడ్డగోలు పేలుళ్లు చేస్తుండటంతో రిజర్వాయర్ కట్ట అదురుతున్నది. దీంతో సీపేజీ పెరుగుతున్నది. కట్టకు 400 మీటర్ల లోపు పేలుళ్లు జరపకూడదన్న ఇరిగేషన్ నిబంధనలను తుంగలో తొకి, 150 మీటర్ల దూరంలోనే భారీ బ్లాస్టింగ్స్ చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు.
బ్లాస్టింగ్ ధాటికి కిలోమీటర్ దూరంలోని తిప్పారం గ్రామంలో ఇండ్లు నెర్రెలు బారినట్టు తెలిపారు. పనులు ఆపాలని ఇరిగేషన్ అధికారులు లేఖ రాసినా బేఖాతరు చేసిన జలమండలి అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. పోలీస్, రెవెన్యూ అధికారులను అడిగితే తామెవరికీ అనుమతులు ఇవ్వలేదని చెప్పారని తెలిపారు. అర్ధరాత్రి వేళ ఈ దొంగ బ్లాస్టింగ్స్ ఎవరి అండతో జరుగుతున్నాయి? అని ప్రశ్నించారు. తక్షణమే అక్రమ బ్లాస్టింగ్స్ ఆపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరారు. గురువారం సిద్దిపేట జిల్లా తిప్పారం గ్రామం వద్ద మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్ట సమీపంలో పైప్లైన్లు, పంప్‌హౌస్ నిర్మాణం కోసం జలమండలి అనధికారికంగా భారీ బ్లాస్టింగ్స్ చేపడుతున్న ఘటనా స్థలాలను తిప్పారం గ్రామస్తులు ఫిర్యాదుతో హరీశ్‌రావు గురువారం పరిశీలించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బకి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, తిప్పారం గ్రామస్తులతో కలిసి రిజర్వాయర్ కట్టను, అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్న ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేలుళ్ల ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇండ్లపై రాళ్లు, మట్టిపెళ్లలు
గతంలో మేడిగడ్డ బరాజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోవడం వెనుక కూడా బ్లాస్టింగ్ జరిగిందా? అనే అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నాయని, ఇక్కడా ఇలాంటి అనుమానాలే బలపడుతున్నాయని పేర్కొన్నారు. కట్టకు కేవలం 100 నుంచి 200 మీటర్ల దూరంలోనే రాత్రిపూట చీకట్లో దొంగచాటుగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్స్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ బ్లాస్టింగ్‌తో ఇండ్లపై మట్టిపెళ్లలు, రాళ్లు ఎగిరి పడ్డాయని తెలిపారు. కొన్ని ఇండ్లలో మంచాలు, వంటపాత్రలు కూడా ఎగిరి పడ్డాయని, కొన్ని ఇండ్ల గోడలు పగుళ్లొచ్చాయని గ్రామస్తులు తెలిపినట్టు చెప్పా రు. కట్ట బండ్‌పై రాళ్లు కూడా ఎగిరిపడ్డాయని వివరించారు. గ్రామ సర్పంచ్, ఇతర గ్రామస్తులు చెప్పడంతో తాను ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు.
పేలుళ్ల తర్వాతే లీకేజీ వస్తుంది: గొర్రెల కాపరి
రెండు నెలలుగా జరుగుతున్న పేలుళ్ల కారణంగానే మల్లన్నసాగర్ నుంచి నీరు లీ కేజీ అవుతున్నదని గొర్రెల కాపరి ఒకరు హరీశ్‌రావుకు వివరించారు. హరీశ్‌రావు రిజర్వాయర్ వద్దకు వెళ్లిన సందర్భంగా అక్కడే ఉన్న గొర్రెల కాపరి పలు విషయాలను వెల్లడించారు. గతంలో నీరు లీకేజీ కాలేదని, బ్లాస్టింగ్ జరుగుతున్నప్పటి నుం చే వస్తున్నాయని తెలిపారు. ఈ కట్ట చుట్టే గొర్రెలు మేపుతానని, కట్ట చుట్టూ ఎగి రిపడ్డ రాళ్లు కనిపిస్తున్నాయని తెలిపారు.
మల్లన్నసాగర్ భద్రతపై ఉత్తమ్‌కు బహిరంగ లేఖ
మల్లన్నసాగర్ భద్రతపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసినట్టు హరీశ్‌రావు చెప్పారు. మంత్రి తక్షణమే స్పందించి ఈ అక్రమ బ్లాస్టింగ్స్పై సమీక్షించాలని, నిపుణులైన ఇంజినీర్లతో కట్టను పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే ఈ బ్లాస్టింగ్ పనులను నిలిపివేయాలని, తిప్పారం సర్పంచ్, గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అక్రమ బ్లాస్టింగ్స్ చేసిన కాంట్రాక్టర్, ఏజెన్సీపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశా రు. అనుమతులు లేకుండా పనులు చేయించిన అధికారులను వెంటనే సస్పెం డ్ చేయాలని కోరారు. ఇండ్లు నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్టపరిహారం చెల్లించి కొత్త ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరారు. మల్లన్నసాగర్ కట్టకు ఏ చిన్న నష్టం జరిగి నా దానికి పూర్తి బాధ్యత జలమండలి అధికారులదేనని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

