న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: హైదరాబాదీకి చెందిన హరిఓం పైప్ ఇండస్ట్రీస్ రూ.100-120 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. 85 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించే ప్రతిపాదపై డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను సెబీకి సమర్పించింది. ఈ ఐపీవో ద్వారా సేకరించిన నిధులను మూలధన వ్యయం, వ్యాపార విస్తరణ కోసం వినియోగించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు సంగారెడ్డిలో నూతన పైపుల యూనిట్‌ను నెలకొల్పబోతున్నట్లు ప్రకటించింది. దీంతో సంస్థకున్న ఏనిమిది యూనిట్ల కెపాసిటీ 51,943 టన్నులకు చేరుకోనున్నది. ఈ కొత్త యూనిట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 170 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ఒక ప్రకటనలలో వెల్లడించింది.