రామడుగు/గంగాధర, ఆగస్టు 1 : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోలిరామయ్యపల్లికి చెందిన మిట్టపల్లి రమేశ్(45) నిరుపేద నేత కార్మికుడు. చిన్న గదిలో మరమగ్గాన్ని ఏర్పాటు చేసుకొని నేత పని చేస్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పని చేసి కుటుంబాన్ని వెల్లదీయగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి చూపకపోవడంతో సాంచాలు నడువక రూ.10 లక్షల అప్పులపాలయ్యాడు. దీంతో బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
‘తహసీల్దార్’ ఎదుట రైతు ఆత్మహత్యాయత్నం
గుర్రంపోడు, ఆగస్టు 1: వ్యవసాయ బోరును రెవెన్యూ ఇన్స్పెక్టర్ సీజ్ చేయడంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన చెందిన రైతు తహసీల్దార్ కార్యాల యం ఎదుట ఆత్మహత్యాయత్నం చేశా డు. పోలీసులు సకాలంలో దవాఖానకు తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన గురువారం నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో జరిగింది.
మండలంలోని తెరాటిగూడేనికి చెందిన కసిరెడ్డి చెన్న మల్లారెడ్డి ఇటీవల తన భూమిలో బోరు వేశాడు. ఆయన అన్న రామకృష్ణారెడ్డి.. తన బోరు కు అతి దగ్గరగా బోరు వేశాడని అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది.