హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : అమ్రాబాద్, కవ్వాల్ టైగ ర్ రిజర్వ్ అటవీ పరిధిలోని గ్రామాల తరలింపు పారదర్శకంగా చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయం లో శుక్రవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ… అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో 26 కోర్ గ్రామాలుండగా 4 గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరిస్తున్నట్టు పేర్కొన్నారు. తొలివిడతలో కవ్వాల్ ప్రాంతంలోని మైసంపేట, రాంపూర్ గూడేలను ఖాళీ చేయిస్తున్నట్టు అధికారులు చెప్పా రు. సలేశ్వరం జాతరకు సౌకర్యాలు క ల్పించాలని మంత్రి సూచించారు. వ న్యప్రాణుల దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, వెడ్మ బొజ్జు, రేకుల భూపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.