హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ మంథని జ్ఞానప్రకాశ్ నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీసీగా జ్ఞానప్రకాశ్ మూడేండ్ల పాటు కొనసాగుతారు. వరంగల్ జిల్లా హసన్పర్తికి చెందిన జ్ఞానప్రకాశ్ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్ విభాగంలో ప్రొఫెసర్, కంట్రోలర్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రిజిస్ట్రార్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు.