హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం తన రాజీనామా లేఖను సీఎస్ శాంతికుమారికి పంపారు.
తన పదవీకాలంలో సహకారం అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ ఇకముందు మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.