హైదరాబాద్: ఏడో రోజు శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. భూభారతి బిల్లుపై స్వల్పకాలిక చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా భూభారతి చట్టం అమల్లోకి రాకముందే పేపర్లలో ప్రకటనలు వచ్చాయని విపక్ష సభ్యులు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) దృష్టి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి తప్పులు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చైర్మన్ సూచించారు. అదేవిధంగా ప్రొటోకాల్ అమలులో అలసత్వం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్సీలను ఆహ్వానించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రొటోకాల్‌పై ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2024 బిల్లును, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లును మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ కొనసాగుతున్నది.